ఎల్లారెడ్డి, జూన్ 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)అమరవీరుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం అని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణఅన్నారు. ఆదివారం తెలంగాణ
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం తెలబగన అమర వీరులను నివాళులు అర్పించి వారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 10 వసంతాలు పూర్తి చేసుకొని 11 వ వసంతంలోకి అడుగిడుతూ ఉత్సాహ పూరిత వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారి ఆశయాలు, ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని, జిల్లాను అభివృద్ధి పధంలో పయనించుటలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ సిబ్బంది వున్నారు.
అమరవీరుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం…మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ
31
previous post