Home తాజా వార్తలు ఓటర్ అవగాహనా 5 కె రన్ ఏర్పాట్లపై ముందస్తు సమావేశం!

ఓటర్ అవగాహనా 5 కె రన్ ఏర్పాట్లపై ముందస్తు సమావేశం!

by V.Rajendernath

చిగురుమామిడి :- ఆగస్టు 16
( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధేశాలకు అనుగుణంగా ఐ ఓటు ఫర్ షూర్ ” అనే నినాదము తో ఈ నెల, 19-08-2023 (శనివారం) రోజున ఉదయం 6.00 గంటలకు చిగురుమామిడి మండల పరిధిలోని ఓటర్ల అవగాహనకై 5 కె రన్ దాదాపు ఐదు కిలోమీటర్లు నిర్వహించుటకు నిర్ణయించారు
ఇట్టి 5 కె రన్ నందు యువ ఓటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖలకు సంబందించిన అధికారులు సిబ్బంది, పుర ప్రముఖులు, యువజన సంఘాల మహిళ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొని విజయవంతము చేయగలరని ఎ ఇ ఆర్ ఓ – తహశీల్దార్ , చిగురుమామిడి మండలము కోరుతూ
ఇట్టి ఓటరు అవగాహన 5 కె రన్ నకు కావలిసిన ముందస్తు ఏర్పాట్లపై మండల స్థాయి అధికారులు మండల పరిషత్ అభివృద్ది అధికారి, చిగురుమామిడి,మండల వైధ్యాదికారి, చిగురుమామిడి,
సబ్ ఇన్స్ పెక్టర్ ఆప్ పోలీసు,అదేవిదంగా ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయము చేసుకొని కార్యక్రమము విజయవంతము ఛేయుటకు ఇట్టి సమావేశంలో నిర్ణయించినారు
5 కె రన్ చిగురుమామిడి బస్టాండు నుండి ప్రారంభంమై పాంబండ వరకు చేరుకొని తిరిగి బస్టాండు ఆవరణకు చేరుకొని ముగించబడు తుందని అని తెలిపినారు.

You may also like

Leave a Comment