ఎల్లారెడ్డి, ఏప్రిల్ 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఎల్లారెడ్డి మండలంలోని అల్మాజీపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. పోచమ్మ తల్లి బోనాల సంధర్బంగా ఆలయం వద్ద ఈ కుస్తీపోటీలు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ ప్రతినిధి సుభాష్ రెడ్డి వనిత రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కుస్తీపోటీల్లో విజేతలుగా నిలిచిన నిజాంసాగర్ మండలం అచ్చంపేట కు చెందిన మైపాల్ కు సిల్వర్ కడియం బహుకరించారు. ద్వితీయ బహుమతిని సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ కు చెందిన మహబూబ్ సాధించారు. ఈ పోటీలను గ్రామస్తులు ఆసక్తికరంగా తిలకించారు. ప్రతి ఏడాది ఇదే విధంగా సాంప్రదాయ పద్దతితో ప్రశాంత వాతావరణంలో కుస్తీ పోటీలు జరుగుతాయని సుభాష్ రెడ్డి తెలిపారు.
అల్మాజీపూర్లో రసవత్తరణగా సాగిన కుస్తీపోటీలు
63