ఎల్లారెడ్డి, ఏప్రిల్ 18:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )వ్యాపారంలో కాంట్రాక్టు అయిపోయినట్టు బీఆర్ఎస్ పార్టీ తో కాంట్రాక్టు అయిపోగానే బీజేపీతో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఎంపీ.బీబీ పాటిల్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు ఆరోపిస్తూ.. బీబీ పాటిల్ పై ఫైర్ అయ్యారు. గురువారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..బీబీ పాటిల్ వ్యక్తిగత స్వార్థం కోసం మూడోసారి ఎంపీగా పోటీ చేస్తున్నాడన్నారు. పది ఏళ్లుగా ఎంపీగా పని చేసి కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ , బాన్సువాడ, నారాయణఖేడ్ సెగ్మెంట్ లకు ఎంపీగా ఏం చేసారని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచి ఏ నదైన ఏ ఒక్క గ్రామంలోనైనా తిరిగి ఒక్క కుటుంబాన్ని అయినా ఆదుకున్నాడా అన్నారు. 2021లో పాత్రికేయ మిత్రులపైన బీబీ పాటిల్ పరువు నష్టం కేసు వేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ.. అప్పుడు నేను పాత్రికేయ మిత్రులకు అండగా ఉన్నానన్నారు. మాస్టర్ ప్లాన్ లో రైతులను మోసం చేసాడని, నిరుద్యోగులను నియోజకవర్గ యువకులకు ఒక్క ఉద్యోగం ఇప్పించకుండా క్యాబ్ డ్రైవర్లుగా, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ గా చేసాడనంబరు. ఒక్క ఉద్యోగం ఇవ్వలే, ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక్క రోడ్డు వెయ్యలేదు చివరికి వచ్చిన నిధులను కూడా వాపస్ పంపిన ఘనత మన ఎంపీ దన్నారు. దయచేసి రైతులు, యువకులు అందరూ ఆలోచించండి, బీజేపీకి ఓటు వేస్తె మూలకున్న కొయ్యను తీస్కొని మన మెడకు ఉరి వేసుకున్నట్టే అన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి అద్భుతమైన అభివృద్ధిని చేసుకుందాం అన్నారు.
వ్యాపారంలో కాంట్రాక్టు అయిపోయినట్టు బీఆర్ఎస్ పార్టీ తో కాంట్రాక్టు అయిపోగానే బీజేపీ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న బీబీ పాటిల్… బీబీ పాటిల్ పై ఫైర్ అయిన ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్
47