Home తాజా వార్తలు ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి సెగ్మెంట్లో హస్తం పార్టీకి భారీ మెజార్టీ కోసం వ్యూహంతో ఎమ్యెల్యే మదన్ మోహన్….ఎల్లారెడ్డి కాంగ్రెస్లో భారీ వలసలు…

ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి సెగ్మెంట్లో హస్తం పార్టీకి భారీ మెజార్టీ కోసం వ్యూహంతో ఎమ్యెల్యే మదన్ మోహన్….ఎల్లారెడ్డి కాంగ్రెస్లో భారీ వలసలు…

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 16:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అగ్రనాయకుడు ప్రచారానికి రానున్న తనదైన రాజకీయ చతురత ప్రదర్శించి ఎల్లారెడ్డి బీఆర్ఎస్ కంచుకోటకు బద్దలు కొట్టి ఎల్లారెడ్డి సెగ్మెంట్ ను హస్తగతం చేసిన రాజకీయ చతురుడు ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు. జహీరాబాద్ ఎంపీ ఎన్నికల్లో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, రాజకీయ అనుభవాన్ని రంగరించుకున్నారు. పట్టుదల, నమ్మకం, విశ్వాసంతో ప్రజల నాడి పట్టేసి మొట్టమొదటి సారి ఎల్లారెడ్డి ఎమ్యెల్యే అయ్యారు. తను ఓడిన చోటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి జహీరాబాద్ సీటు దక్కేలా తనదైన శైలిలో ఎంపీ ఎన్నికల ప్రచార వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిదిలో ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో హస్తం పార్టీకి ఊహించని మెజార్టీ తేవాలని మండలాలు, గ్రామ స్థాయి పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారు ఎన్నికల్లో ప్రజలవద్దకు వెళ్లి నిర్వహించాల్సిన ప్రచార సరళి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం. రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం రాష్ట్ర అభివృద్ధికి ఎలా ముందుకు సాగుతున్నారు, రాబోయే రోజుల్లో ప్రభుత్వ కృషిని ప్రతి గడపకు ఎలా చేర్చాలి, ప్రత్యర్థుల వ్యూహాన్ని ఎలా చిత్తు చేయాలి, అన్న విషయాలపై ఆయనే స్వయంగా ముఖ్య కార్యకర్తలతో వ్యక్తిగత సమావేశాలు నిర్వహిస్తూ, దశ దిశ నిర్ణఇస్తూ వస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ కు భారీ మెజార్టీ సాధించిన సెగ్మెంట్ గా ఎల్లారెడ్డి నిలిచిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాన్సువాడ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అయిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్యెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా పోటా పోటీగా నియోజక వర్గాల్లో ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సాధన కోసం పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో ప్రత్యర్థులకు మదన్ మోహన్ వ్యూహం ఎంటన్నది అవగతం కావడం లేదు. ప్రత్యర్థులపై మీడియా, సోషల్ మీడియా ద్వారా అస్త్రాలు సంధిస్తున్న, కౌంటర్ లు ఇవ్వడంలో ప్రత్యర్థులు విఫలం అవుతున్నారని ఓ వర్గం అంటున్న, ప్రత్యర్థుల వ్యూహం మరో రకంగా వుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కామారెడ్డి జిల్లాలోనే బీఆర్ఎస్ గండికోటకు గండికొట్టి కాంగ్రెస్లోకి భారీ వలసలు రప్పించడంలో తన రాజకీయ చతురతను ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో చాటుతున్నారు ఎమ్యెల్యే మదన్ మోహన్. ఎవ్వరు ఊహించని రీతిలో బీఆర్ఎస్, బీజేపీల నుండి వలసలు రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా లక్షకు పైగా ఓట్లు రాబట్టేందుకు ఆయన అన్ని శక్తులు వొడ్డుతున్నారు. రాష్ట్రలో అధికారంలోకి వచ్చాక
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. ఈ సెగ్మెంట్ లో ఓటర్లు మొదటి నుండి కాంగ్రెస్ ను ఆదరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి జాజాల సురేందర్ గెలిచి , బీఆర్ఎస్ లోకి వెళ్లడంతో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సురేందర్ ను సెగ్మెంట్ ప్రజలు,  పార్టీ మారడం జీర్ణించుకోలేక ఓడించారు. గ్రామ స్థాయిలో నీటి ఎద్దడి తీర్చిడంలో, సీసీ రోడ్ల నిర్మాణంలో, తక్షణ సహాయల్లో  గ్రామాల్లో మదన్ మోహన్ కు ఆదరణ పెరిగింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉన్న ఆయన పలుకుబడి వల్ల ఇప్పటికైతే భారీ స్థాయిలో నిధులు సమకూర్చుతూ.. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ అభిమానాన్ని ఆయన సాధించారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి సెగ్మెంట్లో లో మదన్ మోహన్ రావు రాకతో 80వేలపై చిలుకు ఓట్లతో కాంగ్రెస్ విజయం సాధించడం. 2019 ఎన్నికల్లో జహీరాబాద్ నుండి ఎంపీగా పోటీచేసి స్వల్ప మెజారిటీతో ఓడినా మదన్ మోహన్ రావు కి మంచి పట్టు వుండడం కాంగ్రెస్ ఈ సారి ఎంపీ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో భారీ మెజార్టీ సాధిస్తే, మంత్రి వర్గంలో బెర్త్ కన్ఫామ్ అన్న వాదనలున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రచార పర్వరంలో ఎవరి స్టైల్ లో వారు దూసుకుపోతున్నారు. రాజకీయాల్లో అదృష్టం అనేది ఎవర్ని వరిస్తుందనేది వేచి చూడాల్సిందే.

You may also like

Leave a Comment