Home Epaper లియోనియాలో వీసీల సదస్సు

లియోనియాలో వీసీల సదస్సు

by V.Rajendernath

మేడ్చల్, ఏప్రిల్ 15:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మేడ్చల్ జిల్లా శామీర్ పెట్ లోని లియోనియా లో
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయు) ఆధ్వర్యంలో ఆదివారం నుంచి లియోనియా రిసార్ట్ లో జాతీయస్థాయి వైస్ ఛాన్స్లర్ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఏఐయు అధ్యక్షుడు జీడి శర్మ తెలిపారు. స్వాతంత్రం అనంతరం ఇప్పటివరకు ఉన్నత విద్యలో సాధించిన అభివృద్ధి భవిష్యత్తులో సాధించాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించనున్న ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు సాగే కార్యక్రమానికి సంబంధించిన ప్రాస్పెక్టర్ ను ఉపాధ్యక్షులు వినయ్ కుమార్ పాఠక్, సెక్రటరీ పంకజ్ మిట్టల్, ఇక్ఫాయ్ యూనివర్సిటీ వీసి ఎల్ ఎస్ గణేష్, మాజీ వైస్ ఛాన్స్లర్ మహేందర్ రెడ్డి లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ వందేళ్ళ భారత స్వతంత్ర వేడుకలకల్లా వికసిప్ భారత్ ను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా విద్యా విధానంలో రావాల్సిన మార్పులపై సమగ్రంగా చర్చించనున్నట్లు చెప్పారు. దేశ అభివృద్ధి మొత్తం విద్యుత్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇప్పటికే అద్భుత ప్రగతిని సాధించిన దేశం ఆయా రంగాలలో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలపై వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు. మూడు రోజులు సాగే ఈ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన వివిధ యూనివర్సిటీల కు చెందిన 500 కు పైగా వైస్ ఛాన్స్లర్లు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమాలలో భాగంగా ఏఐయు హ్యాండ్ బుక్ తో పాటు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ త్రు షన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు.

You may also like

Leave a Comment