చేగుంట ఆగస్టు 17:— (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మెదక్ జిల్లా చేగుంట మండలం ఈరోజు చందాయిపేట గ్రామంలో గోజాతి మరియు గేదజాతి పశువులు లో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మరియు నట్టల నివారణ కార్యక్రమం స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలతభాగ్యరాజ్ చేతుల మీదుగా టీకాలు మరియు గోలీలు ఇవ్వడం జరిగింది.సర్పంచ్ స్వర్ణ లత మాట్లాడుతూ గ్రామంలో పశువులు ఉన్న ప్రతి ఒక్కరు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ రామకృష్ణ. గోపాలపుత్ర ప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు