కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల ఎస్సీ స్టడీ సర్కిల్ పరిశీలన
గంభీరావుపేట (సిరిసిల్ల)ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ విద్యార్థులు ఎస్సీ స్టడీ సర్కిల్ ను సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ ను కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ లో విద్యార్థులకు కల్పించిన వసతి, బోజన సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం స్టడీ సర్కిల్ లోని విద్యార్థులతో మాట్లాడారు. ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ విద్యార్థులు స్టడీ సర్కిల్ లోని సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పక్కా ప్రణాళికతో అభ్యసించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. సిరిసిల్ల ఎస్సీ స్టడీ సర్కిల్ లో మొత్తం 100 మంది అభ్యర్థులు ఉన్నారు.55 మంది యువకులు, 45 మంది యువతులు ఉన్నారు. ఇక్కడ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ కోసం రూ. 2500/- యువకులకు ప్రతి నెలా రూ. 100, యువతులకు ప్రతి నెలా రూ. 150 మైంటనేన్స్ కోసం ఇస్తామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్ తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు స్టడీ సర్కిల్ లో సంప్రదించాలని సూచించారు.ఈ సందర్బంగా సూపరింటెండెంట్ మొహమ్మద్ అజాం తదితరులు పాల్గొన్నారు.