Home తాజా వార్తలు పౌరాఘడ్ కు తరలిన సేవాలాల్ దీక్ష స్వాములు….

పౌరాఘడ్ కు తరలిన సేవాలాల్ దీక్ష స్వాములు….

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 15,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మండలంలోని సోమర్యాగడ్ తండా కు చెందిన సేవాలాల్ దీక్ష స్వాములు , సోమవారం తాండాలోని సేవాఘడ్ జగదంబ దేవి, సేవాలాల్ ఆలయం నుండి, వాహనాల్లో మహారాష్ట్ర లోని పౌరాదేవీ ఆలయానికి (పౌరాఘడ్ ) బయలు దేరారు. ఈ సందర్బంగా సేవాలాల్ దీక్ష స్వాములకు, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఉపాధ్యక్షులు గణేష్ నాయక్ , గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, సేవాఘడ్ ఆలయ అభివృద్ధి కమిటీ వారికి పూలమాలలతో సత్కారం చేసి, పూజ కార్యక్రమంలో పాల్గొని దీక్ష స్వాములకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ దీక్ష స్వాములు, తాండా వాసులు తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment