Home తాజా వార్తలు దీర్ఘ కాలిక రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలి….ప్రభుత్వం రైతులపంట రుణాలు ఏక కాలంలో మాఫీ చేయాలని తీర్మానం…                                                          ఎల్లారెడ్డి సొసైటి ఛైర్మన్ ఏగుల నర్సింలు

దీర్ఘ కాలిక రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలి….ప్రభుత్వం రైతులపంట రుణాలు ఏక కాలంలో మాఫీ చేయాలని తీర్మానం…                                                          ఎల్లారెడ్డి సొసైటి ఛైర్మన్ ఏగుల నర్సింలు

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 15,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి సొసైటీలో సభ్యత్వం కలిగి ఉన్న రైతులు దీర్ఘ కాలిక రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని , సొసైటి ఛైర్మన్ ఏగుల నర్సింలు సూచించారు. సోమవారం స్థానిక సొసైటి కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన పాలక వర్గ సమావేశం జరిగింది. ముందుగా సొసైటి కార్యదర్శి విశ్వనాథం ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను సభ్యులకు చదివి వినిపించారు. ఆ తర్వాత చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే సొసైటి పరిధిలో 14 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 6827.60 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వరుస క్రమంలో కొనుగోలు చేయడం జరుగుతోందని, కేంద్రాల వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. సొసైటీలో సభ్యత్వం కలిగి ఉండి సహకార బ్యాంక్ ద్వారా రైతులు తీసుకున్న రుణాలను సక్రమంగా వాయిదాల ప్రకారం చెల్లించి సొసైటి అభివృద్ధికి సహకరించి, తిరిగి నూతన దీర్ఘ కాలిక రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. సొసైటి పరిధిలోని గండిమాసాని పేట్ వద్ద షట్టర్ల నిర్మాణం కోసం, లింగారెడ్డి పేట్ సొసైటి కార్యాలయం భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం, అలాగే అర్హులైన రైతులకు దీర్ఘ కాలిక రుణాల ను ఇచ్చేందుకు, సర్కార్ రైతుల పంట రుణాలు ఏక కాలంలో రుణ మాఫీ చేయాలని పాలక వర్గ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చైర్మన్ తెలిపారు. ఈ సమావేశంలో సొసైటి చైర్మన్ ఏగుల నర్సింలు, వైస్ చైర్మన్ మత్తమాల ప్రశాంత్ గౌడ్, పాలక వర్గ సభ్యులు మర్రి సూర్య ప్రకాష్, ఎం.పౌలయ్య, వై.బాలరాజు, లంబాడి లక్ష్మణ్, సి హెచ్ .పోచమ్మ, ఎం.సత్యవ్వ, చెన్నంగారి సుఖేందర్ రెడ్డి, నాగం గోపి కృష్ణ, పాల్దె నారాయణ, ఎన్.నర్సింలు, సొసైటి కార్యదర్శి విశ్వనాథం, సిబ్బంది మల్లేష్, సాయిబాబు, సత్యనారాయణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment