Home తాజా వార్తలు పంచాయతీ రికార్డులను పరిశీలించిన ఎంపిఓ

పంచాయతీ రికార్డులను పరిశీలించిన ఎంపిఓ

by V.Rajendernath

నాగిరెడ్డిపేట , ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) నాగిరెడ్డిపేట
మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామపంచాయతీ రికార్డులను సోమవారం
ఇన్చార్జి ఎంపిఓ ప్రకాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం సందర్భంగా గ్రామంలో త్రాగునీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, గ్రామ ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎండ తగ్గేవరకు ఇంటి నుండి బయటకు రాకూడదని, ఎండ సమయం కాకముందు తమ పనులను ముగించుకొని ఇంట్లోనే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment