ఎల్లారెడ్డి, ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎల్లారెడ్డి పోలీస్ సర్కిల్ పరిధిలోని లింగంపేట్ మండలం షెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన వివాహిత మహిళ అదృశ్యం ఐనట్లు , భర్త మార్గం సిద్దయ్య , సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట్ మండలం శేట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మార్గం సిద్దయ్య అతని భార్య మార్గం భాగ్య , ఈ నెల 6న భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయని, దీంతో అలిగిన మార్గం భాగ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈనెల 7వ తేదీన ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపేట్ గ్రామంలో తన తల్లి గారి ఇంటికి వచ్చి తన పిల్లలను వదిలేసి వెళ్లిపోయిందని తెలిపారు. కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదనీ, భర్త మార్గం సిద్దయ్య భార్య కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బొజ్జ మహేష్ వివరించారు.