Home తాజా వార్తలు సీసీ పుటేజీల ఆధారంగా దొంగతనం కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ రిమాండ్… ఎల్లారెడ్డి ఎస్ఐ.బొజ్జ మహేష్

సీసీ పుటేజీల ఆధారంగా దొంగతనం కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ రిమాండ్… ఎల్లారెడ్డి ఎస్ఐ.బొజ్జ మహేష్

by V.Rajendernath

ఎల్లారెడ్డి , ఏప్రిల్ 15, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన చోరీ కేసులో నలుగురు నిందితులను, సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్ కు చెందిన షాపులో ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు షాపు తాళం పగలగొట్టి అందులోని సామాన్లను దొంగలించడం  జరిగిందని తెలిపారు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల పుటే జీీల సాయంతో నలుగురు దొంగలను పట్టుకొని విచారించగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం, తాడ్కోలు గ్రామానికి చెందిన అల్లం లక్ష్మణ్, తూర్పాటి చంద్రశేఖర్, చిత్తారి రమేష్, అంద శ్రీ సురేష్ గా గుర్తించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. వారి వద్ద నుంచి ఆటో , 15 వైర్ల బెండలను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ వివరించారు. దొంగతనం కేసులో నిందితులకు గుర్తించి పట్టు కోవడంలో ప్రతిభ కనబరిచిన హోంగార్డ్ ప్రసాద్ ను ఎస్ ఐ. మహేష్ అభినందించారు.

You may also like

Leave a Comment