Home తాజా వార్తలు హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం

హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం

by V.Rajendernath

బాన్సువాడ ఎమ్యెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 13, (తెలంగాణ ఎక్స్ (ఎస్) హామీల అమలులో కాంగ్రె సర్కార్ విఫలమైందని మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక వీకేని ఫంక్షన్ హాల్ మాజీ ఎమ్యెల్యే,  నియోజకవర్గ ఇంచార్జి జాజాల సురేందర్ అధ్యక్షతన నిర్వహించిన ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే  పోచారం  మాట్లాడుతూ..రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. టిఆర్ఎస్ హయంలో కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని రైతాంగానికి పెద్దపీట వేసిన ఘనత టిఆర్ఎస్  ప్రభుత్వానికి దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలతో ముందుకు సాగే పరిస్థితి లేదన్నారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. భారత దేశాన్ని నరేంద్ర మోడీ చేసింది ఏమీ లేదని అన్ని నిత్యవసర సరుకులు షెట్రోల్ డీజిల్ ధరలను అమాంతంగా పెంచడం జరిగిందన్నారు..ప్రజలు ఇప్పటికైనా గమనించి ప్రజా సమస్యలపై పరిష్కరించే దిశగా పనిచేసి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో విద్యుత్తు సాగునీరు సంక్షేమ పథకాలు విషయంలో రాజీలేకుండా నిరంతరాయంగా అందించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. ప్రజలు పాలిచ్చే గేదెను పదిలేసి గోడ్డు గేదెకు మేత, కుడితి వేశారని అది పాలిస్తుందా అన్నారు. జహీరాబాద్ టిఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో జహీరాబాద్ పాలించిన నాయకులు ఏమాత్రం అభివృద్ది చేయలేదని తెలంగాణలో  అధికారంలో వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలం చెందిందన్నారు.  హామీలలో లబ్దిదారులకు హామీలను పూర్తిగా అమలు చేయక పోవడం దుర్మార్గమన్నారు. తనను జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నానని తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం ఎల్లారెడ్డి మా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. జహీరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీలను చిత్తుగా ఓడించాలన్నారు. . ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ,డిసిసిబి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆదిమూలం సతీష్, వెలుట్ల సొసైటీ చైర్మన్ పటేల్ సాయిలు, ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ నర్సింలు, వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచ్ లు , కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

You may also like

Leave a Comment