కామారెడ్డి, ఏప్రిల్ 13:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
మనిషికి ప్రాణం పోసేది దేవుడైతే, ఆయువు తీరే వరకు కాపాడుతూ వచ్చేవారు వైద్యులు, అలాంటి మంచి వృతిలో ఉన్న వైద్యులు నిరుపేదలకు ఆరోగ్యాలకు అవసరం వచ్చిన సమయంలో వారికి అండగా నిలవాలని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలో భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన స్నేహ మల్టీ స్పెషాలిటీ పిల్లల ఆసుపత్రిని ఎమ్యెల్యే ప్రారంభించారు. ఇదే ఆసుపత్రి మెడికల్ గదిని ప్రముఖ సర్జన్ డాక్టర్. నాగేశ్వర రావు ప్రారంభించారు. ఆసుపత్రి ల్యాబ్ ను మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ప్రారంభించారు. ల్యాబ్ ను పిల్లల వైద్యులు కృష్ణ సుంకం ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్యెల్యేను, వైద్యున్ని ఆసుపత్రి యాజమాన్యం సత్కరించారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ..ఆసుపత్రి ఏర్పాటు చేసిన యాజమాన్యం సిద్ది శ్రీధర్, గోపాల్ ను ఎమ్యెల్యే అభినందించారు. ఎల్లారెడ్డి పట్టణంలో పిల్లల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ఆసుపత్రి ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందించి మరింత అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల వైద్యులు డాక్టర్.చంద్రశేఖర్ కిరణ్, డాక్టర్. కృష్ణ సుంకం, డాక్టర్. మారుతి రావు, జడ్పిటిసి ఉషాగౌడ్, జిల్లా జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కమిటి సభ్యులు సోమయాజులు గారి రాజ్ కుమార్, జాతీయ జర్నలిస్ట్ సంఘం(ఢిల్లీ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్, బీఆర్ఎస్ నాయకుడు నునుగొండ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ గౌడ్, గోపి, జర్నలిస్ట్ బొజ్జ శివకుమార్, సంతోష్, శ్రీధర్, శివ, మహేష్, సాయిరాంగౌడ్, పట్టణ ప్రముఖులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ప్రాణం పోసేది దేవుడైతే ఆయువు తీరే వరకు కాపాడేది వైద్యుడు. ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు
57
previous post