Home తాజా వార్తలు క్యాన్సర్ బాధిత చిన్నారికి ఓ పాజిటివ్ రక్తం అందజేతఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

క్యాన్సర్ బాధిత చిన్నారికి ఓ పాజిటివ్ రక్తం అందజేతఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

by V.Rajendernath

కామారెడ్డి, ఏప్రిల్ 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చింత భువన్ (5) చిన్నారికి హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. హైదరాబాదులోని ఐఐఎంసి ఖైరతాబాద్ డిగ్రీ, పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ సహాయ ఆచార్యులు రామకృష్ణ గుప్తా సహకారంతో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ విద్యార్ధి వ్యోమేష్ కుమార్ వెంటనే స్పందించి వైద్యశాలకు వెళ్లి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగింది.
చిన్నారి ప్రాణాలను కాపాడడం కోసం రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత వ్యోమేశ్ కుమార్,ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్, సహాయ ఆచార్యులు రామకృష్ణ గుప్తా లకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలియజేశారు.

You may also like

Leave a Comment