59
కామారెడ్డి, మార్చి 13:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విమోచన దినం’గా కేంద్రం ప్రకటించడంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. బుధవారం అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోదు’ అని స్పష్టం చేశారు. హైదరాబాద్ లిబరేషన్ డే కు సంబంధించి నిన్న కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఏటా ఆ రోజున స్వేచ్ఛా దినంగా జరుపుకోవాలని, అధికారిక కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంది.