హైదరాబాద్, మార్చి 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో) హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం తెలంగాణ మీడియా ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణా జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీజేఏ), తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మెన్ స్పంసించి మీకు నా పూర్తి సహాయ సహకారాలు వుంటాయని హామీ ఇచ్చారు. టీజేఏ రాష్ట్ర అద్యక్షుడు కె.వి. రమణారావు, ఉపాధ్యక్షుడు ఖాసిం, ఖలీల్ అహమ్మద్, ఘోరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ యాదయ్య, మొహమ్మద్ అసద్ అలి, రజియుద్దిన్, హఫిజ్వలి, అహమ్మద్,
తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్ట్, జనరల్ సెక్రటరీ ఎం.ఆర్.ఘోరీ పాల్గొన్నారు.
తెలంగాణ మీడియా ప్రెస్ అకాడమీ చైర్మెన్ ను కలిసిన టీజేఏ ప్రతినిధులు
48
previous post