ఎల్లారెడ్డి, మార్చి 6:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ(కెజిబివి) మహిళ విద్యాలయంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళ వర్కర్ లకు ఎంఈఓ దేవిసింగ్ తన సొంత ఖర్చులతో చీరలు బహుకరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ..ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు సెలవు కావడంతో, మహిళలను గౌరవించాలన్న ఉద్దేశ్యంతో వర్కర్ లకు ముందుగానే చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళలను గౌరవించాలని వారికి ఇచ్చే గౌరవ సత్కారం ఇది అన్నారు. తమను గౌరవించి తమకు చీరలు బహుకరించిన ఎంఈఓకు మహిళ వర్కర్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి అమ్మర్సింగ్, ఎస్ఓ. సరోజన ఉపాధ్యాయులు భాస్కర్, సంతోష్, రమణ పాల్గొన్నారు.
నిజాంసాగర్ కెజిబివిలో వర్కర్లకు చీరలు పంపిణీ చేసిన ఎంఈఓ
55