Home తాజా వార్తలు విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి…- ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్

విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి…- ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్

by V.Rajendernath

ఎల్లారెడ్డి, మార్చి 6,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ సూచించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ” సైబర్ జాగృక్త దివాస్ ” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మత్కడుతూ…తల్లి తండ్రులు తమ పిల్లల పట్ల ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలని, కళాశాలకు వెళ్లి నేరుగా ఇంటికి వస్తున్నాడా లేక ఇంకా ఏమైనా పనులు చేస్తున్నాడా అనే విషయాన్ని గమనించాలని అన్నారు. నేడు ప్రతి విద్యార్థి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వాడటం జరుగుతోందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందవచ్చు అనే సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటిపి మోసాలు, ఫ్రాడ్ కొరియర్ సర్వీస్, సోషల్ మీడియా, తదితర వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆతర్వాత ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గూగుల్ లో కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేసినపుడు సైబర్ క్రైమ్ కి గురి అయ్యి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు అని తెలిపారు. తాను చదువుకునే రోజుల్లో కేవలం ఫేస్ బుక్ మాత్రం చూసే వాడిని అని అన్నారు. నేడు యువత మొబై ఎల్ ఫోన్ లు వాడి,సైబర్ నేరాల బారిన పడుతున్నారని తెలిపారు. అనంతరం ఎస్ఐ బొజ్జ మహేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఫోన్ లో ఉపయోగించే ఇంస్టాగ్రామ్, పేస్ బుక్, వాట్స్ అప్, ట్విట్టర్ అకౌంట్ ల ద్వారా సైబర్ క్రైమ్ కి గురి అవుతున్నారని తెలిపారు. ఒకొక్కరు నాలుగు అకౌంట్ లు మెంటైన్ చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని తెలిపారు. ఆతర్వాత సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 నంబర్ కు డయల్ చేయాలని తెలిపే వాల్ పోస్టర్లను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జయప్రకాశ్ అంకం , బుద్దె అరుణ్ కుమార్, జాతీయ సేవ సమితి అధికారులు కృష్ణ ప్రసాద్ , గోదావరి, విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

You may also like

Leave a Comment