మేడ్చల్, ఫిబ్రవరి 29, (తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
మేడ్చల్ సి బి ఎస్ ఈ గుండ్ల పోచంపల్లి శాఖ శ్రీచైతన్య పాఠశాలలో ” గురువారం స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్” లో భాగంగా “ఫ్యామిలీ ఫెస్ట్” ను ఘనంగా నిర్వహించినట్లు విద్యా సంస్థల డైరెక్టర్ సీమా తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసి, వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సీమ మాట్లాడుతూ తల్లి తండ్రుల పాదాలను పూజించి పాద పూజ చేసి గౌరవించడం హైందవ సంస్కృతి లోని సనాతన ధర్మం అని గుర్తు చేశారు. తల్లి తండ్రులు మాట్లాడుతూ, పాద పూజ ద్వారా విద్యార్థుల్లో నైతికత, మానవతా విలువలు అంతరించి పోకుండా ఉపయోగ పడతాయని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తల్లి తండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని విద్యార్థులచే భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎ జి ఎం జీ.వి.రమణా రావు, ప్రిన్సిపాల్ ఎ. రాజేష్ రెడ్డి, కోఆర్డినేటర్స్ శ్రీ రవి కుమార్, జైపాల్ రెడ్డి , డీన్స్ సోమేష్ , అఖిల్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందినీ, తల్లిదండ్రలను, విద్యార్థిని, విద్యార్థులనూ విద్యాసంస్థల డైరెక్టర్ సీమ ప్రత్యేకంగా అభినందించారు.