Home తాజా వార్తలు ఎల్లారెడ్డిలో ఘనంగా శివస్వాముల సాముహిక పడిపూజ

ఎల్లారెడ్డిలో ఘనంగా శివస్వాముల సాముహిక పడిపూజ

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో శనివారం రాత్రి శివ మాలధారణ చేసిన స్వాములు సామూహిక పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజారి సంగాయప్ప శివలింగానికి అభిషేకాలు చేయించారు. అందమైన పడిలో శివపార్వతులకు పడిపూజ నిర్వహించారు. రాత్రి పడి వెలిగించి పూజ పూర్తి చేశారు. అనంతరం భక్తులకు శాస్త్ర ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ శాస్త్ర ప్రసాదాన్ని 10వ వార్డు కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్ వితరణ చేశారు. ఈ పూజకు అల్పాహార దాతగా నిలిచిన పద్మ శ్రీకాంత్ కు శివ స్వాములు శాలువతో సత్కరించారు. పూజకు హాజరైన భక్తులు శివపార్వతుల దర్శనం చేసుకొని, తీర్థ, అల్పాహారం ప్రసాదాలు స్వీకరించి వెళ్లారు.

You may also like

Leave a Comment