కులం మతం లేని సమ సమాజాన్ని నిర్మిద్దాం..
బివిఎం రాష్ట్ర కార్యదర్శి జివియం విఠల్
కామారెడ్డి, ఫిబ్రవరి 19:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జివియం విఠల్ మాట్లాడుతూ దేశంలో అసమానతలు లేని సమసమాజ నిర్మాణానికి చత్రపతి శివాజీ మహారాజ్ కృషి చేశారన్నారు. తన రాజ్యంలో కులం,మతం భేదం లేకుండా అందరూ సమానులే అని స్వేచ్ఛ సమానత్వగా జీవించారని అన్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ శూద్రుడు అనే కారణంతో తన పట్టాభిషేకానికి ఆదిపత్య కులాలు అడ్డుకోవడంతో తను భారీ మూల్యాన్ని చెల్లించి రాజుగా పట్టాభిషేకం చేశారన్నారు.కానీ ఏనాడు అధైర్య పడకుండా తన రాజ్యంలో ప్రజలకు సమస్యలు రాకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా పరిపాలన చేశారు. శివాజీ స్ఫూర్తితో కులం మతం లేని సమసమాజ నిర్మాణాన్ని నిర్మించుకుందామని అన్నారు.నేడు మనువాదులు శివాజీ చరిత్రను అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు.
భారతదేశంలో కుల వ్యవస్థకు మనువాద బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. నేడు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తూ , సమాజం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలపై ప్రతి విద్యార్థి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో అందరికీ ఉచిత విద్య, వైద్యం,ఉపాధి అందే విధంగా శివాజీ స్ఫూర్తితో పోరాటం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుల్లెట్,యశ్వంత్,జిల్లా నాయకులు అజయ్, శ్రవణ్, భాను తదితరులు పాల్గొన్నారు.