ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయి మందిరంలో ఈ నెల 14న వసంత పంచమి 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ముత్యపు వీరేశలింగం తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, ఉదయం 6గంటలకు కాకడ హారతితో పూజలు ప్రారంభం అవుతాయని, 6.20కి సాయి దివ్య విగ్రహానికి మంచామృతాల్తో మంగళ స్నానం, అభిషేకం, మహాపూజ, 8.30నిముషాలకు శ్రీ.గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, మాతృకపూజ, ఋత్విక్ వర్ణం,నవగ్రహపూజలు. 12గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం సాయి రథయాత్ర, పాదుకల ఊరేగింపు, 9గంటలకు శేజహారతితో పూజ కార్యక్రమాలు ముగుస్తాయన్నారు.
సాయిమందిరంలో 14న ఘనంగా వసంత పంచమి వేడుకలు….. శ్రీ షిర్డీ సాయిరాం ఆలయ కమిటీ ప్రతినిధి ముత్యపు వీరేశలింగం
44