Home తాజా వార్తలు ప్రతి ఒక్కరు బాధ్యత విస్మరించరాదు

ప్రతి ఒక్కరు బాధ్యత విస్మరించరాదు

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఆగస్టు 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )

ప్రతి ఒక్కరు బాధ్యత విస్మరించరాదని ఎమ్ఐఎమ్ మండల నాయకుడు రజాక్ అన్నారు. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో స్వతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులకు అధ్యాపకులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. స్వాతంత్ర 77 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా విద్యార్థులు మన గతం మరువకూడదు అని ఈ స్వాతంత్ర భారత దేశంలో మన స్వేచ్ఛను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడవాలని మనకు స్వతంత్రం కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకోవాలన్నారు.

You may also like

Leave a Comment