Home తాజా వార్తలు తాగుడుకు బానిసై ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మ హత్య

తాగుడుకు బానిసై ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మ హత్య

by V.Rajendernath

కామారెడ్డి, ఫిబ్రవరి 3:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్లారెడ్డి మండలం బిక్కనూర్ గ్రామంలో శనివారం జరిగింది. ఎల్లారెడ్డి ఎస్ఐ. బొజ్జ మహేష్ కథనం ప్రకారం  బిక్కనూర్ గ్రామంలో చాకలి మోహన్(24)తాగుడుకు బానిసై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం అతని తల్లి  దుర్గవ్వ చూసే సరికి ఉరివేసుకొని చనిపోయి వున్నాడు.  రెండేళ్ల క్రితం మోహన్ కు వివాహం కాగా, 9 నెలల పాప ఉంది. భార్యతో గోడవపడగా భార్య పుట్టింటికి వెళ్ళింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరిపించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. వివరించారు.

You may also like

Leave a Comment