Home తాజా వార్తలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల పెట్టెలు సిద్ధం చేసిన కామారెడ్డి ఎమ్యెల్యే

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల పెట్టెలు సిద్ధం చేసిన కామారెడ్డి ఎమ్యెల్యే

by V.Rajendernath

కామారెడ్డి, ఫిబ్రవరి 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నారు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే తన కోసం టైం వేస్ట్ చేసుకోకుండా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ మేరకు మేజర్ గ్రామపంచాయతీలకు మూడు నాలుగు ఫిర్యాదు పెట్టెలతో పాటు మిగతా గ్రామాలకు ఒక్కొక్క పెట్టెను సరఫరా చేశారు. వారిని బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు భిక్కనూరు , దోమకొండ, కామారెడ్డి, బీబీపేట్, మండల బీజేపీ నాయకులతో పాటు, అన్ని గ్రామాల నాయకులకు ఫిర్యాదు పెట్టాలను పంపించారు.

You may also like

Leave a Comment