కామారెడ్డి, జనవరి 23:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
కామారెడ్డి జిల్లా విద్య శాఖ కార్యలయం లో పాతుకు పోయిన పలువురు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని నూతన అధికారులను నియమించాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేసారు. మంగళవారం కామారెడ్డి గంజ్ పాఠశాలలో పనిచేసే నీలం లింగం అనే ప్రధాన ఉపాధ్యాయుడు గత కొన్ని నెలలుగా పాఠశాల ముఖం చూడడం లేదనే పలువురు విద్యార్థుల తల్లిదండ్రలు మా విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకురావడంతో ఆ పాఠశాలను సందర్శించామని తెలిపారు. అక్కడ నిజంగానే సదరు ప్రధానోపాధ్యాయుడు విధులకు హాజరు కావడం లేదని గుర్తించి పాఠశాలలో ఆరతీయగా విద్యా శాఖ కార్యలయం లోనే ఉంటాడని విషయం తెలిసిందన్నారు. సదరు ప్రధానఉపాధ్యాయడు ACGE గా విధులు నిర్వహిస్తాడని కేవలం పరీక్షల సమయంలో తప్ప మిగిలిన సమయంలో పాఠశాల లోనే ఉండాల్సి ఉన్న విద్య శాఖ కార్యలయం లోనే ఉంటూన్నాడని ఆరోపించారు. దీనిపై DEO గారిని ప్రశ్నిస్తే స్టేట్ నుంచే సదరు అధికారిని నియమించారని సమాధానం ఇస్తున్నాడని ఎన్ని సంవత్సరాలు అల ఉంటాడని ప్రశ్నిస్తే దాటావేత ధోరణి ప్రదర్శిస్తున్నాడని ఇక మీదట పాఠశాలలో నే ఉండేలా చూస్తామని చెబుతుందడడం విడ్డురంగా ఉందని తెలిపారు. కేవలం విద్యా శాఖ అధికారి నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతుందని మండిపడ్డారు. ఆయనతో పాటు ఏళ్లుగా పాతుకుపోయిన DSO, AGF, DCEB లను వేరే వారిని నియమించాలని డిమాండ్ చేయడం జరిగింది. లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. ఈ విషయంలో విద్యార్థులకు న్యాయం చేయడం కోసం విద్యా శాఖ ఉన్నతాధికారులను సైతం కలుస్తామని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో బి డి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ ,బివిఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విటల్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి భరత్, మండల అధ్యక్షుడు రోషన్, జిల్లా నాయకుడు ఫణి తదితరులు పాల్గొన్నారు