Home తాజా వార్తలు శబరిమలకి బయలుదేరిన అయ్యప్ప స్వాములు

శబరిమలకి బయలుదేరిన అయ్యప్ప స్వాములు

by V.Rajendernath

నిజాంసాగర్, జనవరి 13:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
నిజాంసాగర్ మండలంలోని
మాగి అభయాంజనేయ క్షేత్ర సన్నిదానంలో మాగి, నిజాంసాగర్ లకు చెందిన అయ్యప్ప స్వాములు శనివారం ఇరుముడి ధరించి, శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు 41 రోజులపాటు ఎంతో కఠోరమైన దీక్షలను నియమ నిబంధనలతో పాటించి ఎల్లారెడ్డికి చెందిన చంద్రం గురుస్వామి స్వాములకు ఇరుముడి కట్టారు. ఇరుముడి అన్తరం 18మెట్ల పూజ చేసి, ఇరుముడి నెత్తిన ధరించి శబరిమల బయలు దేరి వెళ్లారు. అయ్యప్ప స్వాముల సింగీతం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త అనిల్ సెట్ బిక్ష( అన్నదానం ) ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వాములు శబరిమలై వెళ్తున్న సమాచారం తెలుసుకున్న బంధువులు, మిత్రులు అధిక సంఖ్యలో హాజరై అయ్యప్ప స్వాముల ఆశీర్వాదాన్ని పొందారు. భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేసిన వ్యాపారవేత్త అనిల్ సేట్ కు స్వాములు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

You may also like

Leave a Comment