42
ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు అందిస్తున్న సేవలకు “సేవా పథకం అవార్డు”కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని గ్రామాల యూత్ ప్రెసిడెంట్లు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల్ యూత్ ప్రెసిడెంట్ అజర్ ఖాద్రీ, పోసానిపల్లి గ్రామ నాయకుడు కె.రమేష్, మండలంలోని గ్రామాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.