Home తాజా వార్తలు మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్ ఇద్దరిమృతి…నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం…

మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్ ఇద్దరిమృతి…నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం…

by V.Rajendernath

హైదరాబాద్, డిసెంబర్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో) హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో మంగళవారం కోవిడ్ వైరస్ తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన చాలితో కోవిడ్ మహమ్మారి మళ్ళీ కలకలం సృష్టిస్తుంది. సోమవారం వరంగల్ జిల్లా లో ఒక కుటుంబంలో ఐదుగురు కోవిడి బారిన పడిన విషయం విధితమే. తాజాగా హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో తీవ్ర జ్వరంతో చేరిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వీరు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకోవడానికి వైద్యులు చికిత్సలు నిర్వహించగా కోవిడ్ తో మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ వైద్యులు అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఈసారి కోవిడ్ ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది అందానికి ఈ రెండు కోవిడ్ మరణాలు ఉదహరించవచ్చు. ప్రతి ఒక్కరు జనాల్లో తిరిగితే తప్పని సరి మాస్కులు ధరించాల్సిందే అని వైద్యులు సూచిస్తున్నారు. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, నీరసం, ఒళ్ళు నొప్పులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు. కరోన ఊపిరి తిత్తులపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి నిర్లక్ష్యం చేయా వద్దని వైద్యులు కోరుతున్నారు.

You may also like

Leave a Comment