Home తాజా వార్తలు ప్రజలకు సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చా..అవినీతికి పాల్పడితే ఎవ్వరినీ వదలను…అధికారులందరూ పారదర్శకతతో పనిచేయాలి …- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

ప్రజలకు సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చా..అవినీతికి పాల్పడితే ఎవ్వరినీ వదలను…అధికారులందరూ పారదర్శకతతో పనిచేయాలి …- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

by V.Rajendernath

ఎల్లారెడ్డి, డిసెంబర్ 23,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చానని, సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలులో అవినీతికి పాల్పడితే ఎవ్వరినీ వదలను అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హెచ్చరించారు. శనివారం పట్టణంలోని తన సొంత క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులందరూ పారదర్శకతతో పనిచేయాలని ప్రభుత్వం అందించే ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకం నియోజకవర్గంలోని ప్రతి నిరుపేదకు అందించాలని ఆదేశించారు. అవినీతిని తను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించనని, దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పనిచేయా లన్నారు. ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో పాటు జిల్లా, డివిజన్, మండల స్థాయి వివిధ శాఖల అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో సివిల్ సప్లై, హౌసింగ్, ఆర్ అండ్ బి, పి ఆర్, వైద్యం, విద్య, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖలపై సమీక్షించానని ఆయా శాఖలో ఖాళీలను గుర్తించి నివేదికల రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అలాగే అభివృద్ధి పనులు నిమిత్తం నివేదికల రూపొందించాలని అధికారులకు సూచించామన్నారు. నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని ప్రజలు తన దృష్టికి తెచ్చారని, ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించా నన్నారు. అలాగే పాఠశాలల్లో కనీస వసతులు లేవని ఉపాధ్యాయుల కొరత ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారన్నారు. వాటిని సైతం పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, పట్టణంలోని ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ తో పాటు సిబ్బంది కొరత ఉందని గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటి పరిష్కారానికి జిల్లా వైద్యశాఖ అధికారి లక్ష్మణ్ సింగ్ తో మాట్లాడాను అన్నారు. పంట నష్టం పై వ్యవసాయ అధికారులతో మాట్లాడానని, నివేదికల రూపొందించేందుకు ఆదేశించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్య భీమా పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అందజేస్తామని అన్నారు. యువతకు క్రీడల నిమిత్తం మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పోడు భూముల సమస్యలు కూడా తన దృష్టికి వచ్చాయని వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తానన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ వంటి తదితర సమస్యలను అధికారుల సహాయంతో త్వరలోనే పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. గత పాలకుల చేతిలో నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదని వచ్చే ఐదు సంవత్సరాలలో ఇక్కడ ప్రత్యేకంగా పేద ప్రాంతం ఉందని ముఖ్యంగా సమస్యలు చాలా ఉన్నాయని ఇండ్ల సమస్యలు విపరీతంగా ఉందన్నారు. నేను ఈ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి మొదటగా ఇండ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment