Home తాజా వార్తలు దొరల పాలన పోయింది తెలంగాణలో ప్రజల పాలన వచ్చింది…..మాజీ మంత్రి షబ్బీర్ అలీ

దొరల పాలన పోయింది తెలంగాణలో ప్రజల పాలన వచ్చింది…..మాజీ మంత్రి షబ్బీర్ అలీ

by V.Rajendernath

కామారెడ్డి, డిసెంబర్ 14:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)దొరల పాలన పోయింది తెలంగాణలో ప్రజల పాలన వచ్చిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. గురువారం పట్టణంలోని సత్య గార్డెన్ లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీమంత్రి షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. షబ్బీర్ అలీ ముందుగా మాట్లాడుతూ, కామారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని రేవంత్ రెడ్డి తెలిపారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఆరు పథకాలను అమలు చేస్తామని అన్నారు. మొదటగా మహాలక్ష్మి పథకం నుండి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశాం, ఆరోగ్యశ్రీ 10 లక్షల వర్తింపుల్ కూడా అమలు చేశాం అన్నారు. మిగతా గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతిపక్షాలు విమర్శలను తిప్పి కొట్టాలన్నారు. రైతుబంధు అనేది గతంలో కెసిఆర్ రైతుబంధుగా ప్రచారం చేశారని తెలిపారు. ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రైతుబంధు పంపిణి పై తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు అందిస్తుందని చెప్పారు .సీఎం పేరు రేవంత్ రెడ్డి పేరు పెట్టవద్దని సూచించారని అన్నారు.తెలంగాణ ప్రజల త్యాగాల వల్ల ఏర్పాటయిందని, కెసిఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాలేదని తెలంగాణ ప్రజలు గ్రహించాలన్నారు. కార్యకర్తలు ఈ శాసనసభ ఎన్నికల్లో ఎంతో కృషి చేశారని, ఎంతో కష్టపడ్డారని వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసిన, నాయకులను, కార్యకర్తలను గుర్తించి తగిన పదవులను అందిస్తామన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. అధిష్టానం రేవంత్ రెడ్డిని కామారెడ్డి లో పోటీ చేయాలని పేర్కొనడం వల్ల, తాను నిజామాబాద్ అర్బన్ లో పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. రాబోయే 15 . రోజుల్లో కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులపై ప్రత్యేక సమావేశం హైదరాబాదులో నిర్వహిస్తారని తెలిపారు.నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కార్యక్రమాల పై చర్చించనున్నట్లు తెలిపారు. బి ఆర్ ఎస్ హాయంలో కామారెడ్డి లో అభివృద్ధి శూన్యం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కొండల్ రెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు . కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారన్నారు. షబ్బీర్ అలీ కార్యకర్తలను అధికారంలో ఉన్న, లేకున్నా ఆ దు కుంటూ వచ్చారన్నారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్, ఇందిరా నగర్, టీచర్స్ కాలనీ, బతుకమ్మ కుంట, గోసంగి కాలనీ, బీడీ వర్కర్స్ కాలనీ, ఆర్.బి నగర్, వంటి కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి పార్టీ కార్యకర్తకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏ సమస్య వచ్చినా షబ్బీర్ అలీ గారి దృష్టికి తీసుకురావాలని కొండల్ రెడ్డి కోరా రూ.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, ప్రముఖ పారిశ్రామికవే తిమ్మయ్య గారి వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ, నిజామాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు మాణాల మోహన్ రెడ్డి, రామారెడ్డి మండల జడ్పిటిసి సభ్యుడు నా రెడ్డి మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ఇందు ప్రియా, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి. పండ్ల రాజు, మాజీ సీడీసీ చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, గో నే శ్రీనివాస్. న్యాయవాది దేవరాజ్ గౌడ్, పంపరి లక్ష్మణ్ , భిక్కనూరు మండల కాంగ్రెస్ నాయకులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి డిసిసిబి మాజీ చైర్మన్, ఎడ్ల రాజిరె, బిబిపేట, రాజంపేట ,రామారెడ్డి మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment