ఎల్లారెడ్డి, డిసెంబర్ 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి ప్రజలకు పాలకుడిని కాదు, నేను ఎల్లారెడ్డి ప్రజల సేవకుడిని అని
ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం ఎమ్యెల్యే హోదాలో మొదటిసారిగా ఎల్లారెడ్డి ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టారు. ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ,
ఎమ్మెల్యేగా గెలిపించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నా దగ్గర ఉన్న ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించానన్నారు. అందులో భాగంగానే ఇవాళ నియోజవర్గంలోని రెవెన్యూ, పోలీసు శాఖలను సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఇకపై ప్రజలందరి అవసరాలు, సంక్షేమం లక్ష్యంగా అధికారుల పనితీరు ఉంటుందని, నేను ఎన్నికల ప్రచార సమయంలో చెప్పినట్లుగానే హామీలన్నింటినీ పూర్తి చేస్తా, ఇందులో భాగంగా అధికారులతో జరిగిన సమీక్షలో చర్చించాం అన్నారు. ఇకపై ప్రతీ వారం మండలాల వారీగా అన్ని శాఖ అధికారులు ఒకే దగ్గర మీకు అందుబాటులో ఉంటారన్నారు. సంబంధిత హెల్ప్ సెంటర్లలో మీమీ సమస్యలను ప్రభుత్వాధికారులకు తెలుపవచ్చని, ఆయా సమస్యల తీవ్రతను బట్టి అధికారులు అప్పటికప్పుడు మీమీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారన్నారు. ఇందుకు అవసరమైన సూచనలను, ఆదేశాలను ముఖ్యమైన అధికారులందరికీ నేను ఇప్పటికే అందించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం. అందుకే ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాంది పలికిన మరుసటి రోజే.. మన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసే ప్రయత్నం ప్రారంభించిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. ఇకపై ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మహిళలంతా.. కామారెడ్డికి గానీ, నిజామాబాద్ కు గానీ, హైదరాబాద్ కు గానీ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా వెళ్లవచ్చన్నారు. ఇది ఎంతో సాహసంతో తీసుకున్న నిర్ణయం అన్నారు. ఇది కాంగ్రెస్ సర్కార్ తోనే సాధ్యం అన్నారు.
ఎల్లారెడ్డి ప్రజలకు పాలకుడిని కాదు సేవకుడినిఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు
54
previous post