61
ఎల్లారెడ్డి, డిసెంబర్ 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేగా విజయం సాధించిన కె. మదన్ మోహన్ రావు సోమవారం ఎల్లారెడ్డి ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో మొదటిసారిగా అడుగు పెట్టనున్నారు. ఉదయం 11గంటల నుండి సాయంత్రం వరకు ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు ఎమ్యెల్యే స్వయంగా తెలిపారు. ప్రజలు ఆ సమయంలో ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో తనను కలవ వచ్చని తెలిపారు.