Home తాజా వార్తలు 18 వ సారి రక్తదానం చేసిన వెంకటరమణ….

18 వ సారి రక్తదానం చేసిన వెంకటరమణ….

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఆగస్టు 15,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, మంగళవారం కామారెడ్డి మోటార్ వెహికల్, మెకానిక్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన మెగా రక్త దాన శిబిరంలో, ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 5 వ వార్డు కింద గల గండిమాసాని పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ ఎం. పర్స వెంకట రమణ 18 వ సారి రక్తదానం చేసినట్లు, కామారెడ్డి రక్త దాతల సంస్థ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు తెలిపారు. ప్రాణాపాయ స్థితి లో ఉన్న వారికి రక్త దానం చేసి ప్రాణాలు కాపాడటం ఎంతో అభినందనీయం అని అన్నారు. ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ 3 నెలల కు ఒక మారు రక్త దానం చేయవచ్చని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెహికల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ గౌడ్, సెక్రెటరీ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment