హైదరాబాద్, నవంబర్ 29:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు నిజామాబాద్ డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డిపై బుధవారం బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. బాన్సువాడ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఇంటి పై మంగళవారం అర్ధరాత్రి పోచారం భాస్కర్ రెడ్డి, అతని అనుచరులు పాత బాలకృష్ణ, ప్రమోద్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు శంభు రెడ్డి కొడుకు వినోద్ రెడ్డిలు అక్రమంగా ప్రవేశించి డ్రైవర్లను కొట్టడమే కాకుండా మాజీ ఎమ్మెల్యేను చంపుతామని బెదిరించారని ఆరోపణల నేపథ్యంలో, బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.