Home తాజా వార్తలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ సంక్షేమ పథకాలు…. ఎన్నారై రాష్ట్ర ఫోరమ్ సభ్యుడు కిషోర్ రెడ్డి

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ సంక్షేమ పథకాలు…. ఎన్నారై రాష్ట్ర ఫోరమ్ సభ్యుడు కిషోర్ రెడ్డి

by V.Rajendernath

హైదరాబాద్, నవంబర్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఎన్నారైల ఫోరం రాష్ట్ర సభ్యుడు కిషోర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ కు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అమెరికా దేశంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటున్న, ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని లింగంపేట్ మండలానికి చెందిన కిషోర్ రెడ్డి ఇండియా కు వచ్చారు. ఆదివారం ఆయన ఎల్లారెడ్డిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయని, వెనుకబడి ఉన్న ఎల్లారెడ్డి ని ఎమ్మెల్యే సురేందర్ చాలా అభివృద్ధి చేసారని అన్నారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రోడ్ల నిర్మాణం, ఎల్లారెడ్డి ఓఎద్ద చెరువు కట్ట వెడల్పు, ర్డండు కాజ్ వేలపై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వంతెనలు నిర్మాణం, రైతులకు సాగు నీరు,ప్రజలకు తాగునీరు అందించారన్నారు. అభువృద్ది చేస్తున్న సురేందర్ గెలుపుకు ప్రచారం కిశం రావడం జరిగిందన్నారు. ప్రజలు స్థానికంగా ఉండే టీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్ కి ఓటు వేసి గెలిపించాలని, స్థానికంగా ఉండలేని మదన్ మోహన్ రావు ని గెలిపిస్తే ఎవరికీ అందుబాటులో ఉండడని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, జడ్పిటిసి ఉషా గౌడ్, సొసైటీ వైస్ చైర్మెన్ ప్రశాంత్ గౌడ్, సురేందర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment