కామారెడ్డి, నవంబర్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)రచయిత్రి ఉషాబాల పవన్ కుమార్ సేవలు అభినందనీయమని ఎన్ యుజె(ఐ) కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చండీమంత్రాలయం, హ్రియానంద ఆశ్రమంలో ఉషాబాల రాసిన ఉషాపవనాలు పుస్తకావిష్కరణ ఆశ్రమ గురూజీ హ్రియా నంద స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజేందర్ నాథ్ మాట్లాడుతూ, కాశీ లో స్థిరపడిన ఉషాబాల పవన్ కుమార్ ఎల్లారెడ్డి ప్రాంతంలో చేసిన సేవలు వివరించారు. అనంతరం గురూజీ హ్రియా నంద స్వామి మాట్లాడుతూ, జీవితంలో ప్రతి మనిషి సేవాభావాన్ని అలవర్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంచి ఉద్యోగులుగా సేవలు అందించి, శేష జీవితాన్ని కాశీలో గడుపుతూ, అక్కడి నుండి రచయిత్రి ఉషాబాల పవన్ కుమార్ ప్రజాసేవ చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు వారి వారి సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో పుస్తకావిష్కరణ నిర్వాహకులు శేఖర్, వెంకట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉషాబాల పవన్ కుమార్ సేవలు అభినందనీయం
75
previous post