ఎల్లారెడ్డి, నవంబర్ 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ):
కట్క వేయగానే వచ్చే కరెంటు కావాలా …కటిక చీకటి కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ కావాలో ప్రజలు తేల్చు కోవాలని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మంత్రి రోడ్ షోలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా ఎల్లారెడ్డి కి చేరుకున్న మంత్రిని హెలిప్యాడ్ వద్ద, స్థానిక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ మంత్రి నెరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా సాయిబాబా అలయంకు చేరుకుని బాబాను దర్శించుకున్నారు. ఎదురుగా ఉన్న శబాషావలి దర్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంపై గాంధీ చొక్ వరకు చేరుకుని అక్కడ రోడ్ షోలో ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి లీడర్లను కొంటే కొనవచ్చు గానీ ఎల్లారెడ్డి ప్రజల ఆత్మగౌరవాన్ని మాత్రం కొనలేడని…ప్రజలు మాత్రం అమ్ముడు పోరుఅని కేసిఆర్ పక్షాన నిలబడుతారని అన్నారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ 5 గ్యారంటీలను నమ్మి మోసపోయానని, వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని అన్నారు. 5 గంటల కరెంటు అంటే పాత రోజులు మళ్ళీ వస్తాయని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే కేసీఆర్ ఉండంగా 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కు ఓటేద్దామ అని ప్రశ్నించారు. గతంలో ఉచిత కరెంటు అంటూ ఉత్త కరెంటు చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్ ది అని విమర్శించారు. కరెంటు కావాలంటే కారు గుర్తుకు ఓటు గుద్దాలని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఎరువుల కోసం లైన్ లో చెప్పులు పెట్టి నిలుచున్న దుస్తితి నుంచి …రైతును రాజు చేయడమే లక్ష్యంగా సిఎం కేసీఆర్ సర్కార్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, చెరువుల నిర్మాణం, చెక్ డ్యామ్ లు, ఎరువులు, విత్తనాలు , రైతు పండించిన వరి ధాన్యాన్ని ఊరూరా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తున్న ఏకైక సిఎం కేసీఆర్ అని, కళ్యాణ లక్ష్మి, షాదిముబారాక్, రైతు బందు, రైతు భీమా, దళిత బందు , బిసి బందు ఇచ్చిన ఏకైక సిఎం కేసీఆర్ కొనియాడారు. కరెంటు బిల్లులు, భూమి శిస్తు, నీటి తీరువాను గత ప్రభుత్వాలు రైతుల నుంచి వసూలు చేశాయని, రైతుకు తిరిగి డబ్బు ఇచ్చింది కేసిఆర్ సర్కార్ అని అన్నారు. రైతుల్లో కేసిఆర్ ఉన్నాడు కరెంటు ఇస్తాడు అనే ధైర్యం ఉందని అన్నారు. కాంగ్రెస్ ను నమ్మి రిస్క్ లో పడొద్దు అని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రం లో లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎంగా కేసిఆర్ ….రాష్ట్ర హ్యాట్రిక్ సిఎం గా చరిత్ర సృష్టించడం ఖాయం అని అన్నారు. తిరిగి అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఎకరాకు 16 వేల రూపాయల రైతుబందు ఇస్తాం అని మేనిఫెస్టో లో ప్రకటిస్తే కాంగ్రెస్ దాన్ని నకల్ కొట్టిందని, నకల్ కొట్టే తెలివి లేక రామక్క పాటను సైతం నకల్ కొట్టారని ఎద్దేవా చేసారు. కర్ణాటకలో 5 గ్యారంటీ ల అమలు దేవుడెరుగు కానీ డిగ్రీ, పిజి విద్యార్థులకు 80 శాతం ఉపకార వేతనాల్లో కోత విధించారని అన్నారు. కాంగ్రెస్ జాతీయ అద్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే తెలంగాణకు వచ్చి సుద్దులు చెప్పుతున్నాడని అసలు మీ ఊళ్ళో నీళ్ళు, రోడ్లు సక్రమంగా ఉన్నాయా అవీ చూడు, యువశక్తి కింద యువకులకు ఒక్క పైసా ఇప్పటి వరకు ఇయ్యలేదు, కాంగ్రెస్ తెలంగాణను బిక్షగ ఇచ్చిందని నోటికొచ్చినట్లు మాట్లాడు తున్నావు ఖబడ్దార్ ఖర్గే… తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్నామని హెచ్చరించారు. కేసీఆర్ సర్కార్ తిరిగి అధికారం లోకి రాగానే ఆసరా పించన్ 2 వేల నుంచి 5 వేలకు పెంచుతామని, గ్యాస్ సిలెండర్ 400 రూపాయలకు ఇస్తాం , రేషన్ షాపుల్లో సొనామసూరి బియ్యం ఇస్తాం అని, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 10 వేల ఇండ్లు ప్రత్యేక కోట కింద మంజూరు చేయిస్తా అని తెలిపారు. ఎల్లారెడ్డి లో గత పాలకులు చేసిన అభివృద్ది ఏమి లేదని, సురేందర్ హయాంలో పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని స్వయంగా మంజూరు చేశానని, పనులు కొనసాగుతున్నాయని. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని, బస్టాండు నిర్మాణం చివరి దశలో ఉన్నాయని, చెరువు కట్టకు ఇరువైపులా హై లెవెల్ బ్రిడ్జి లు నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. అభివృద్ది కళ్ళకు కనబడుతోంది అని, మరింత అభివృద్ది చేసుకోవడాని కోసం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జాజాల సురేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి మరో మారు అసెంబ్లీకి పంపించాలని కోరారు. అంతకు ముందు బి ఆర్ ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి సురేందర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా ప్రజల మధ్య ఉంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి, నియోజక వర్గ ప్రజలకు సేవలు అందించానని, పట్టణంలో చేసిన అభివృద్ది కనబడుతోంది అని, అభివృద్ది కి చూసి తనను మరోమారు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ రోడ్ షోలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో పాటు జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్సీ సరోత్తం రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జాజాల సురేందర్, మాజీ మంత్రి నేరేళ్ళ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ గౌడ్, స్థానిక మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, జడ్పీటిసి ఉషా గౌడ్, గాంధారి ఎఎంసి చైర్మన్ సత్యం రావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎఎంసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కౌన్సిలర్లు పద్మ శ్రీకాంత్, నీలకంఠం, అల్లం శ్రీను, భూంగారి రాము, సొసైటి చైర్మన్ నర్సింలు, వైస్ చైర్మన్ మత్తమాల ప్రశాంత్ గౌడ్, నునుగొండ శ్రీనివాస్, గాదె తిరుపతి, నాయకులు సాయి ప్రకాష్ దేష్ పాండే, నాయకులు, కార్యకర్తలు గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.