ఎల్లారెడ్డి, ఆగస్టు 10, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
చదువుకు పేదరికం అడ్డు కాదని నూతనంగా ఎంపికైన జూనియర్ సివిల్ జడ్జి కుమారి సాయి శ్రీ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత బాలిక పాఠశాలలో గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతిలో మంచి జి పి ఎస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినిలు పవర్ నందిని, హరిణిలకు చేరి ఒక్కరికి 10 వేల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి శ్రీ మాట్లాడుతూ కృషి పట్టుదల, చదువు కోవాలి అనే తపన విద్యార్థుల విజయానికి సోపనాలన్నారు. మీ తల్లిదండ్రుల పేదరికం పోవాలంటే అది కేవలం విద్యతోనే సాధ్యమని విద్యకు మించిన ఆస్తి లేదన్నారు. అమ్మాయిలు ఐఏఎస్, ఐపీఎస్ లే కాకుండా అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ఇందు కోసం ఇప్పటి నుంచే లక్ష్యం నిర్దేశించుకుని చదువుకోవాలని సూచించారు. గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో నగదు చెక్కులు పంపిణీ చేయడం అభినందనీ యమన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంచి జి పి ఎస్ మార్కులు సాధించిన అనిల్ కుమార్ కు సైతం 10 వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఈఓ ఎవి వెంకటేశం, గోర్తి ఈశ్వర ట్రస్ట్ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి, సభ్యులు మదన్, నునుగొండ సత్యనారాయణ మూర్తి, విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులు ఆకుల కిష్టయ్య, ఉపాధ్యా యులు సంతోషి కుమారి, రాజ్యలక్ష్మి, అంబిక, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.