Home తాజా వార్తలు మంచిర్యాల జిల్లా విద్యారంగ సమగ్ర అభివృద్ధికై ఎస్ఎఫ్ఐ జిపు యాత్ర

మంచిర్యాల జిల్లా విద్యారంగ సమగ్ర అభివృద్ధికై ఎస్ఎఫ్ఐ జిపు యాత్ర

by V.Rajendernath

మంచిర్యాల, ఆగస్టు 10, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా విద్యారంగం సమగ్ర అభివృద్ధికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీపు యాత్ర ప్రారంభించారు. గురువారం మూడవరోజు జన్నారం పట్టణ కేంద్రానికి ఎస్ఎఫ్ఐ జీపు యాత్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల జన్నారంలో చేరుకొని, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా అద్యక్షులు దాగం శ్రీకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర లో విద్యా వ్యవస్థ లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వ మాత్రం పరిష్కారం చేయడం లేదని, ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తానని చెప్పి నేటికీ 9 సంవత్సరాల గడుస్తున్న
అమలు చేయడం జరుగుత లేదన్నారు. అదే విధంగా ప్రతి మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పి ఏర్పాటు చేయలేదు, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే ఐదువేలుయాన్నారు. పైగా కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయాని, రాష్ట్రంలో 25 వేలకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని భర్తీ చేయడం లేదని, వెంటనే ఆ పోస్టులను భర్తీ చేయాలన్నారు. మనఊరు-మనబడి కార్యక్రమాన్ని మండలంలోని ఒకటి రెండు పాఠశాల మాత్రమే వర్తింపజేస్తున్నారు. దానివల్ల మిగతా పాఠశాలలలో చదువుకుంటున్న విద్యార్థులకు కనీస వసతులు లేకపోయాయాని, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మన ఊరు మనబడి మనబస్తి మనబడి కార్యక్రమాన్ని వర్తింపజేయాలన్నారు.
అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని,
అద్దె భవనాలలో నడుస్తున్న సంక్షేమ హాస్టళ్లకు పక్క భవనాలు నిర్మించాలని, జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాత్ర బృందం నాయకులు ఈదునూరి అభినవ్, మాదాసు రాజు, దినేష్, సాయి గణేష్, అజయ్, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment