Home తాజా వార్తలు హెలిప్యాడ్ స్థల పరిశీలించిన కర్ణాటక ఎమ్మెల్యే ప్రభు పాటిల్

హెలిప్యాడ్ స్థల పరిశీలించిన కర్ణాటక ఎమ్మెల్యే ప్రభు పాటిల్

by V.Rajendernath

బిచ్కుంద నవంబర్ 21:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మండలం చిన్న దేవాడ శివారులో హెలీ ప్యాడ్ స్థలాన్ని కర్ణాటక ఎమ్మెల్యే ప్రభు పాటిల్ పరిశీలించారు .
ఎన్నికల ప్రచార నిమిత్తం ఈనెల 24వ తేదీ సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్కు వచ్చుతున్న సందర్భంగా మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ భాస్కర్ రెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థి తోట కాంతారావుగా మద్దతుగా ఎన్నికల ప్రచార నిమిత్తం ఈనెల 24 రోజున సాయంత్రం నాలుగు గంటలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగు వస్తున్నట్లు తెలిపారు. ఈ మీటింగ్ కు కార్యకర్తలు నాయకులు ప్రజలు పెద్ద మొత్తంలో హాజరై విజయవంతం చేయాలని ప్రజలను కోరినారు. వీరితోపాటు
కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధర్పల్లి శేఖర్, సచిన్ ,అశోక్ ,మునీర్ తదితరులు ఉన్నారు

You may also like

Leave a Comment