Home తాజా వార్తలు బిఆర్ఎస్ పార్టీలో పలువురి చేరికలు..

బిఆర్ఎస్ పార్టీలో పలువురి చేరికలు..

by V.Rajendernath


పెద్ద కోడప్గల్ నవంబర్ 21 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):-మండలంలోని జగన్నాథ్ పల్లి, మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మంగళవారం ఎంపీపీ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. వీరిని ఎంపీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరుతున్నారని. పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. టిఆర్ఎస్ జుక్కల్ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఖండేరావు, గుండె రావు, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment