Home తాజా వార్తలు విద్యార్థినీలకు వైద్య పరీక్షలు…ఉచితంగా మందులు పంపిణీ..

విద్యార్థినీలకు వైద్య పరీక్షలు…ఉచితంగా మందులు పంపిణీ..

by V.Rajendernath

ఎల్లారెడ్డి, నవంబర్ 21,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థినీలకు, కెజిబి విద్యార్థినీ లకు, మంగళవారం మత్తమాల పీహెచ్ సి అధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వసతి గృహ సంక్షేమ అధికారిణి శారద, కేజీబి విద్యాలయ ఎస్ ఓ సుశీల తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ శరత్ కుమార్ ఎస్సీ వసతి గృహం లోని 46 మంది విద్యార్థినీలకు ఒక్కొక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కావాల్సిన మందులను, ఐరన్ మాత్రలు ఉచితంగా అందజేశారు. ఆ తర్వాత వైద్యాధికారి మాట్లాడుతూ, చలికాలంను దృష్టిలో పెట్టుకొని విద్యార్థినిలు చలి నుంచి రక్షణ పొందాలని సూచించారు. ప్రతి విద్యార్థిని వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఒకరి లో దుస్తులు మరొకరు వాడవద్దని, భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం చేయాలని సూచించారు. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అలాగే కేజిబి విద్యాలయంలో ఎం ఎల్ హెచ్ పీ వైద్యులు సచిన్, అందరు విద్యార్థినీలకు వైద్య పరీక్షలు నిర్వహించి, జలుబు, దగ్గు, జ్వరం కు సంబంధించి అవసరమైన విద్యార్థినీలకు మందులను అందజేశారు. అలాగే ఐరన్ మాత్రలను కూడా అందజేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తి గత పరిశుభ్రత పట్ల శ్రద్ద తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ విక్రమ చారి, ఎంఎల్ హెచ్ పీ మాధురి, ఎఎన్ఎం లు ఇందిరా, సరిత, సావిత్రి, ఆశా వర్కర్లు సంధ్య, అంజమని, కెజిబివి లో సిబ్బంది అంజన, శ్రీదేవి, స్వర్ణలత, ఎఎన్ఎం లు భూలక్ష్మీ, సరిత, సావిత్రి, విద్యార్థినిలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment