Home తాజా వార్తలు ఉత్తమ సర్పంచ్ గా వెంకటరమణా చౌదరి (బాబి)కు అవార్డు, ప్రశంస పత్రం :*మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా రాధకు అందజేత..

ఉత్తమ సర్పంచ్ గా వెంకటరమణా చౌదరి (బాబి)కు అవార్డు, ప్రశంస పత్రం :*మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా రాధకు అందజేత..

by V.Rajendernath

మిర్యాలగూడ ఆగస్టు 15 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామ సర్పంచ్ భోగవిల్లి వెంకటరమణ చౌదరి కు ఉత్తమ సర్పంచ్ అవార్డు, ప్రశంసా పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతులు మీదుగా మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్ వి. కర్ణన్, జిల్లా ఎస్పీ అపూర్వరావు, నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్లు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఆర్డిఓ చెన్నయ్య తదితరులు హాజరైనారు. కేంద్ర, రాష్ట్ర పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ నల్గొండ జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో పంచాయితీ రాజ్ ఉత్తమ గ్రామపంచాయతీ, ఉత్తమ సర్పంచ్ అవార్డులను సర్పంచ్ వెంకటరమణ చౌదరి (బాబి) అందుకున్న విషయం పాఠకులకు విధితమే. గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులను కొనసాగిస్తూ అవార్డులతో అధికారుల, ప్రజల ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వెంకటరమణ చౌదరి కు మరోసారి ఉత్తమ సర్పంచ్ గా అవార్డు రావడం పట్ల మిర్యాలగూడ మండల సర్పంచ్ల ఫోరం, ఎంపీటీసీల ఫోరం, బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా వెంకటరమణ చౌదరికు శుభాకాంక్షలు తెలియజేశారు.

You may also like

Leave a Comment