Home తాజా వార్తలు గ్రామాలలో ఘనంగా బిఆర్ఎస్ అభ్యర్థికి స్వాగతం

గ్రామాలలో ఘనంగా బిఆర్ఎస్ అభ్యర్థికి స్వాగతం

by V.Rajendernath

నిజాంసాగర్ నవంబర్ 21,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):

నిజాంసాగర్ మండలంలోని మల్లూర్,ఓడ్డే పల్లి,మాగి,బంజపల్లి, సుల్తానగర్ గ్రామాలలో జుక్కల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండేకు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం మల్లూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో మహిళలు మంగళ హారతులతో పాటు బోనాలతో ఘనంగా స్వాగతించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి, ఉమ్మడి జిల్లాల జడ్పీ మాజీ చైర్మన్,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దపేదర్ రాజు మహిళలతో కలిసి కోలాటం ఆడారు. డీజే పాటలు బ్యాండ్ లతో గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు పట్లోల్ల దుర్గారెడ్డి,సిడిసి చైర్మన్ గంగారెడ్డి ,వైస్ ఎంపీపీ మనోహర్,సింగల్ విండో చైర్మన్ లు నర్సింహారెడ్డి, వాజిద్ అలీ,ఒంటరి కళ్యాణి విఠల్ రెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, సర్పంచ్ లు అంజయ్య,ఖాసీం సాబ్, అమినాబి, మండల రైతు బంధు అధ్యక్షులు మహేందర్ కుమార్, నాయకులు యాటకారి నారాయణ, ఆనంద్ కుమార్, చాకలి రమేష్ కుమార్, పిట్ల సత్యనారాయణ, బంగ్లా ప్రవీణ్, సందీప్ కుమార్ అహ్మద్ హుస్సేన్, మేకల విజయ్ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment