Home తాజా వార్తలు భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాకి హై అలర్ట్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ హెచ్చరిక

భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాకి హై అలర్ట్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ హెచ్చరిక

by V.Rajendernath

కామారెడ్డి, జూలై 27:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపత్యంలో, వాతావరణ శాఖ కామారెడ్డి జిల్లా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిందని, జిల్లాకు హై అలెర్ట్ ప్రకటించిన దృశ్య ప్రజలు జాగ్రతగగా వుండలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కోరారు. గురువారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడం జరిగిందగని, వాగులు, చెరువులు నీటి ప్రవాహం వద్ద , కరెంటుతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ట్రాన్స్కో అధికారులు అప్రమత్తంగా ఉందాలన్నారు. నిజాంసాగర్,
కౌలాస్ నాల, పోచారం , కళ్యాణి ఇతర ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దన్నారు. ఈ రోజంతా వర్షం కురుస్తుంది. వాగులు వంకలు నీటి ప్రవాహాల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

You may also like

Leave a Comment