Home తాజా వార్తలు ఎల్లారెడ్డి తహశీల్దార్ కార్యాలయంను సందర్శించిన ఆర్డీవో రాథోడ్ రమేష్ ….ఈవిఎం ల అవగాహన కేంద్రాన్ని పరిశీలించి అవగాహన కల్పించిన ఆర్డీవో…

ఎల్లారెడ్డి తహశీల్దార్ కార్యాలయంను సందర్శించిన ఆర్డీవో రాథోడ్ రమేష్ ….ఈవిఎం ల అవగాహన కేంద్రాన్ని పరిశీలించి అవగాహన కల్పించిన ఆర్డీవో…

by V.Rajendernath

ఎల్లారెడ్డి, జులై 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంను, బుధవారం నూతన ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టిన రాథోడ్ రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా వందేళ్ల పురాతన తహశీల్ కార్యాలయం అంతా స్థానిక తహశీల్దార్ జి.సుధాకర్ తో కలిసి కలియ తిరిగారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఆర్డీవో తో పురాతన కార్యాలయ భవనం వర్షాలకు కురుస్తోంది అని విలువైన కంప్యూటర్ పరికరాలు, రికార్డులు తడిసే ప్రమాదం ఉందని వివరించారు. ఇదే కార్యాలయంలో గల ఎస్టీఓ కార్యాలయం కూడా పై కప్పు నుంచి కురుస్తుందని, తెలపడంతో ఆర్డీవో అక్కడ కూడా పరిశీలించారు. అలాగే రికార్డులు (కాస్రా పహానిలు) భద్ర పరిచే గదిని పరిశీలించారు. రికార్డులు వర్షానికి తడిచి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహశీల్దార్, సిబ్బందికి సూచించారు. భవనం తాత్కాలిక మరమ్మత్తుల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని తహశీల్దార్ ఆర్డీవో ను కోరారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం లో కొనసాగుతున్న ఈవిఎం అవగాహన కేంద్రాన్ని తనిఖీ చేసి, ఓటర్లకు సిబ్బంది ఈవిఎం, వివి ప్యాట్ ల పట్ల అవగాహన కల్పిస్తున్న తీరును పరిశీలించారు. స్వయంగా వాటి పని తీరును ఆర్డీవో పరిశీలించి ఓటర్లకు వాటి గురించి వివరించారు. ఆతర్వాత రిజిస్ట్రేషన్ లు రోజు వారీగా ఎన్ని జరుగు తున్నాయి అని తహశీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు . కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. విఆర్ఎ లు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని, వర్షాలకు ఎక్కడైనా పాత ఇల్లు కూలితే వెంటనే పూర్తి వివరాలతో కార్యాల యంలో రిపోర్ట్ రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాథోడ్ రమేష్ వెంట తహశీల్దార్ సుధాకర్, ఎంపిఎస్ఓ స్వాతి, సీనియర్ అసిస్టెంట్ వాణి, ఆర్డీవో కార్యాలయం హెచ్ హెచ్ పీ ఇమ్రాన్, విఆర్ఎ లు వెంకట్, రవి, వినోద్, పోచయ్య తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment