మంచిర్యాల, జులై 24, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): కవ్వాల్ టైగర్ జోన్ పరిధి జన్నారం మండల రేంజ్ చింతగూడెం గ్రామానికి చెందిన పానుగంటి శ్రీనివాస్ అక్రమంగా చెట్లు నరికివేస్తూ, వన్య ప్రాణులను వేటాడుతున్నాడని, నేపథ్యంతో సోమవారం జన్నారం మండల తాసిల్దార్ ఇట్యాల కిషన్ ముందు అటవీ అధికారులు బైండోవర్ చేశారు. తాసిల్దార్ మాట్లాడుతూ అటవీ రెంజ్ పరిధిలో చెట్లను నరికివేయారదని, వన్యప్రాణులను వేటాడకూడదని ఇకముందు వేటాడుతే జరిమానా, చెట్టుపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మండల గ్రామంలోని ఎవరైనా చెడ్డ వ్యతిరేకమైన పనులు చేయరాదని వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలోని గ్రామాలలో ఎక్కువగా చింతగూడ గ్రామంలో వన్యప్రాణులను వేటాడటం జరుగుతుందని అన్నారు. అటవీ అధికారులు అడవిలో చెట్లను నరికే, వన్యప్రాన్లను వేటాడే వారిపై అటవీలో ఎక్కువగా ఉద్యోగ బాధ్యతలు వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా చెట్లు నరుకుతూ వన్యప్రాణులను వేటాడుతున్నడనే నేపథ్యంతో తాసిల్దార్ ముందు బైండోవర్ చేసిన అటవీ అధికారులు
38